
- రామగుండం బల్దియా నోటీసులు జారీ
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ సంస్థకు చెందిన ప్లాంట్‌టౌన్‌షిప్ నిర్మాణాలకు అనుమతులు తీసుకోకపోవడంపై బల్దియా భారీ జరిమానా విధించింది. టౌన్షిప్లో కొత్తగా ఆరు నిర్మాణాలు చేపట్టగా వాటికి పర్మిషన్లు లేవంటూ రూ.99.28 కోట్ల ఫైన్ వేస్తూ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. టైప్-బి బిల్డింగ్‌కు రూ.39,61,90,154, హెడ్ఆఫ్ది డిపార్ట్‌మెంట్ బిల్డింగ్‌కు రూ.18,55,70,351, టైప్డీ బిల్డింగ్‌కు రూ.27,29,72,955, గెస్ట్‌హౌస్ బిల్డింగ్‌కు రూ.6,61,64,044, ఏసీ రెస్టారెంట్బిల్డింగ్కు రూ.2,35,63,705, కమ్యూనిటీ సెంటర్బిల్డింగ్కు రూ.4,83,62,341 జరిమానా వేశారు. ఎన్టీసీపీలో చేపట్టిన ఆరు నిర్మాణాలకు ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదని పేర్కొంటూ మార్చి 19న కమిషనర్జె.అరుణ శ్రీ ఎన్టీపీసీ మేనేజ్మెంట్కు నోటీస్‌లు పంపించారు. నోటీస్‌లకు సంస్థ పెనాల్టీ చెల్లించకపోవడంతో -2019 యాక్ట్ కింద భారీగా ఫైన్విధించినట్లు కమిషనర్ తెలిపారు.